హైకోర్టులో మరోసారి ఏపీ సర్కార్

స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించలేమని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు మరోసారి తెలిపింది. ఈ మేరకు అఫడవిట్ ను దాఖలు చేసింది. ఫిబ్రవరి నెలలో కరోనా వ్యాక్సిన్ [more]

;

Update: 2020-12-15 10:59 GMT

స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించలేమని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు మరోసారి తెలిపింది. ఈ మేరకు అఫడవిట్ ను దాఖలు చేసింది. ఫిబ్రవరి నెలలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా దీనిని చేపట్టాల్సి ఉంటుందని పేర్కొంది. మొదటి డోస్ తర్వాత నాలుగు వారాలు గ్యాప్ ఇచ్చి రెండో డోస్ ను వేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ వ్యాక్సిన్ వేయడం చాలా ముఖ్యమని, దీనివల్ల తాము స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేమని పేర్కొంది. ఈ కేసును హైకోర్టు వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

Tags:    

Similar News