జగన్ ప్రభుత్వం ప్రజా రవాణాకు సిద్ధమయింది… కానీ?

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకోనుంది. త్వరలో ప్రజా రవాణాను పునరుద్ధరిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ముందస్తు కసరత్తులు ప్రారంభించింది. ఈ నెల 17వ తేదీ తర్వాత [more]

Update: 2020-05-09 04:15 GMT

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకోనుంది. త్వరలో ప్రజా రవాణాను పునరుద్ధరిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ముందస్తు కసరత్తులు ప్రారంభించింది. ఈ నెల 17వ తేదీ తర్వాత ప్రజా రవాణాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుండటంతో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ముందస్తు కసరత్తులు ప్రారంభించారు. కండక్టర్ లేని వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రయాణికులు ఆన్ లైన్ లోనే టిక్కెట్లు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాలకు తిరిగే బస్సుల్లో డిపోల వద్దనే టిక్కెట్లు పొందాల్సి ఉంటుంది. బస్సుల్లో ఇరవై కి మింది అనుమతించే అవకాశం లేక పోవడంతో భౌతిక దూరం పాటించేలా సీట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

Tags:    

Similar News