Perni Nani : పేర్నినాని అరెస్ట్ కు రంగం సిద్ధం...ముందస్తు బెయిల్ కు యత్నం

మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు. పోలీసులు ఇప్పటికే పేర్ని నానిపై కేసు నమోదు చేశారు

Update: 2024-12-31 07:27 GMT

మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు. పోలీసులు ఇప్పటికే పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నానిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయినట్లు ప్రచారం జరుగుతుండటంతో పాటు రిమాండ్ రిపోర్టులోనూ ఆయనను నిందితుడిగా చేర్చడంతో ఆయనను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. పోలీసులు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాకపోవడంతో ఆయనను అరెస్ట్ చేసేందుకే ఏ6గా చేరుస్తూ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. పేర్నినాని ఆదేశాల మేరకే రేషన్ బియ్యం మాయమయినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు పేర్నినానిని కూడా అరెస్ట్ చేసేందుకు రెడీ అయ్యారు.

బియ్యం మాయం కేసులో...


రేషన్ బియ్యం మాయం కేసులో అరెస్టయిన నలుగురికి న్యాయస్థానం పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించింది. ఈ కేసులో పేర్ని నాని ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో నానిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది. తన భార్య పేరిట మచిలీపట్నంలో గోదామును నిర్మించి అందులో పౌర సరఫరాల శాఖకు చెందిన బియ్యాన్ని నిల్వ ఉంచారు. అందులో నుంచి బియ్యం మాయమయ్యాయని తేలడంతో కొంత మొత్తాన్ని పేర్ని నాని కుటుంబం చెల్లించింది. అయితే 3కోట్లకు పైగా చెల్లించాలంటూ పౌరసరఫరాల శాఖ అధికారులు తిరిగి నోటీసులు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి ఇంకా పేర్ని నాని కుటుంబం ఇంకా మిగిలిన నిధులను చెల్లించలేదు.
ముందస్తు బెయిల్ కోసం...
ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ పేరును ఏ1 నిందితురాలిగా చేర్చారు. అయితే పేర్నినాని జయసుధకు మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పేర్ని నాని కొద్దిసేపటి క్రితం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటీషన్ వేశారు. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కోరారు. అయితే దీనిపై విచారణ జరగాల్సి ఉంది. లంచ్ మోషన్ పిటీషన్ లో పేర్ని నానికి ఊరట దక్కకుంటే ఈరోజు ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. మచిలీపట్నంలో ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసుల రెడీ అవుతుండటంతో ఆయనను అరెస్ట్ చేస్తారన్నప్రచారం జరుగుతుంది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News