చంద్రబాబు, రాహుల్ గాంధీ భేటీతో మహాకూటమికి తొలి అడుగు పడిందని మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం విజయవాడ చేరుకుని ఆంధ్రరత్న భవన్ లో కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గెహ్లాట్ మాట్లాడుతూ చంద్రబాబు, రాహుల్ తదుపరి భేటీ గురించే మాట్లాడేందుకు తాను ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. రాహుల్ దూతగానే తాను వచ్చానన్నారు.
సభలు, ర్యాలీలపై.....
తెలంగాణలో రాహుల్ గాంధీ, చంద్రబాబు కలసి సభలో పాల్గొనే విషయం పై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. ఏపీలో కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై మాత్రం ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదని గెహ్లాట్ అభిప్రాయపడ్డారు. మరికాసేపట్లో గెహ్లాట్ చంద్రబాబుతో భేటీ కానున్నారు. మహాకూటమి తరుపున జాతీయ స్థాయిలో ఎక్కడెక్కడ ర్యాలీలు, సభలు నిర్వహించాల్సిన విషయం కూడా ఈ సమావేశంలో ప్రస్తావించే అవకాశముంది.