వైసీపీలో సంబరాలు

జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎన్ఐఏ కు అప్పగించడంతో వైసీపీ శ్రేణులు ఆనందంతో మునిగిపోయాయి. ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టేందుకు ఇది ఒక అవకాశంగా [more]

Update: 2019-01-04 06:47 GMT

జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎన్ఐఏ కు అప్పగించడంతో వైసీపీ శ్రేణులు ఆనందంతో మునిగిపోయాయి. ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టేందుకు ఇది ఒక అవకాశంగా వైసీపీ భావిస్తుంది. జగన్ పై పక్కా ప్లాన్ తో హత్యాయత్నం చేసినప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డ్రామాగా అభివర్ణించారని, కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని వైసీపీ మాజీ ఎంపీ మిధున్ రెడ్డి అన్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో కత్తి ఎలా వచ్చింది? విశాఖ ఎయిర్ పోర్టు లో సీసీ కెమెరాలు ఏమయ్యాయి? డీజీపీ వెంటనే ఇది అభిమాని చేసిన దాడిగా ఎందుకు చెప్పారు? ఈ ప్రశ్నలన్నింటికీ ఎన్ఐఏ నుంచి సమాధనం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పుతో తమకు న్యాయం జరుగుతుందని, నిజానిజాలు బయటకు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ హత్యాయత్నం కేసులో కుట్రదారులెవరో బయటపడతారని ఆయన చెప్పారు.

Similar News