బాలకృష్ణ, చంద్రబాబు.. ఇద్దర్నీ అరెస్టు చేసిన సంజయ్ సర్ ...
సీనియర్ పోలీస్ ఆఫీసర్ , ఏపీ సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ టీడీపీ అధినేత చంద్ర బాబును అరెస్టు చేశారు. దీనిలో ఏముంది అంటారా ?
బాలకృష్ణ, చంద్రబాబు..
ఇద్దర్నీ అరెస్టు చేసిన సంజయ్ సర్ ...
సీనియర్ పోలీస్ ఆఫీసర్ , ఏపీ సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ టీడీపీ అధినేత చంద్ర బాబును అరెస్టు చేశారు. దీనిలో ఏముంది అంటారా ? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అవ్వడం మామూలు విషయం కాదు. కారణం వైఎస్‌ఆర్ హయాంలో చంద్రబాబును ఎవరూ అరెస్టు చెయ్యలేకపోయారు. తనపై 27 కేసులు పెట్టినా ఏమీ చెయ్యలేకపోయారని స్వయంగా చంద్రబాబే చాలా సార్లు అన్నారు. అలాంటి చంద్రబాబును ఓ సీఐడీ అధికారి సంజయ్ అరెస్టు చెసి, తన వాదన బలంగా వినిపించారు. మరో విషయం ఏమంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు కాల్పుల కేసులో నందమూరి బాలకృష్ణను కూడా ఆయనే అరెస్టు చేశారు. ఇప్పుడు వైఎస్‌ఆర్ కొడుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబును అరెస్టు చేయడం.
త్వరలో చంద్రబాబు కొడుకు నారా లోకేష్‌ని కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా సంజయ్ ప్రెస్‌మీట్‌లో చెప్పారు.
1996 బ్యాచ్ IPS ఆఫీసర్ అయిన సంజయ్ ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (APCID)కి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 9 ఉదయం 6 గంటల సమయంలో చంద్రబాబును అరెస్టు చెయ్యడంతోనే ఎవరా ఆఫీసర్ అని చాలా మంది గూగుల్‌లో సెర్చ్ చేశారు. AP స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో చంద్రబాబు రూ.371 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని సంజయ్ తెలిపారు.
2004లో హైదరాబాద్‌లో కొంతమందిపై రివాల్వర్‌తో దాడి చేశారనే ఆరోపణలతో . ప్రస్తుతం హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్నబాలకృష్ణను సంజయ్ అరెస్టు చేసి కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. అప్పట్లో ఆయన హైదరాబాద్ వెస్ట్ జోన్‌లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP)గా ఉన్నారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చెయ్యడంపై ఉదయం 9 గంటల నుంచి విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఉదయం 10.30కి చిన్న బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత మళ్లీ 11 గంటలకు వాదనలు కొనసాగాయి. మళ్లీ 12 గంటలకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్‌కి ముందు వాదనలు హోరాహోరీగా జరిగాయి. అనంతరం తీర్పును ఏసీబీ కోర్టు రిజర్వ్ లో ఉంచింది.