నడ్డాతో హీరో నితిన్ భేటీ
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హీరో నితిన్ తో భేటీ అయ్యారు;

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హీరో నితిన్ తో భేటీ అయ్యారు. ఆయనతో భేటీ దాదాపు ముప్పావు గంటకు పైగా సమావేశం జరిగింది. నోవాటెల్ లో బస చేసిన జేపీ నడ్డా వద్దకు వచ్చిన నితిన్ కు ఆయన సాదర స్వాగతం పలికారు. సినిమాల గురించి చర్చించారా? రాజకీయ అంశాలపై మాట్లాడారా? అన్నది బయటకు రాకపోయినా ప్రజల్లో ఈ అంశం మాత్రం వేగంగా వెళ్లే అవకాశం మాత్రం ఉంది.
ఏ అంశంపై అనేది....
నితిన్ తో నడ్డా జరిపిన సమావేశంలో రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావులు కూడా ఉన్నారు. సినిమా పరిశ్రమపై నడ్డా నితిన్ తో చర్చించారని చెబుతున్నారు. ఎవరూ ఈ విషయంపై బయటకు చెప్పకపోయినా నితిన్ అభిమానులు, రాజకీయ పార్టీల్లో మాత్రం ఆసక్తి నెలకొంది.