బ్లూ మూన్, సూపర్ మూన్, బ్లడ్ మూన్ అంటే... రేపు, ఎల్లుండి భూమికి అతి దగ్గరగా చంద్రుడు

ఈ నెల చివరి రోజులైన ఆగస్టు 30,31 ల్లో బ్లూ మూన్ ను చూడవచ్చు. ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమిని బ్లూమూన్ అంటారు.

Update: 2023-08-29 15:06 GMT

బ్లూ మూన్, సూపర్ మూన్, బ్లడ్ మూన్ అంటే...

రేపు, ఎల్లుండి భూమికి అతి దగ్గరగా చంద్రుడు

ఈ నెల చివరి రోజులైన ఆగస్టు 30,31 ల్లో బ్లూ మూన్ ను చూడవచ్చు. ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమిని బ్లూమూన్ అంటారు. సూపర్ మూన్ లో ప్రత్యేకత ఏమంటే చంద్రుడు సాధారణం కంటె 15 రెట్లు పెద్దగా,40 శాతం ఎక్కువగా ప్రకాశవంతంగా కనిపిస్తాడని నాసా న్యూస్ వీడియో వెల్లడించింది. అది చంద్రుడి కక్ష్య భూమికి 50 వేల కిలోమీటర్లు దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది. సూపర్ మూన్ , బ్లూ మూన్ కలసి రావడం 2037 వరకు ఏర్పడదు. సూపర్ మూన్ సమయంలో చంద్రగ్రహణం ఏర్పడితే దానిని బ్లడ్ మూన్ అంటారు.

బ్లూమూన్ రేపు రాత్రి 9.30 లకు, ఎల్లుండి ఉదయం 7.30 గంటలకు చూడవచ్చు. ఇలాంటివి ఏర్పడినప్పుడు ప్రజల మనస్సులపై ప్రభావం ఉంటుందని నమ్మేవారున్నారు. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడతాయి. (సాధారణ పౌర్ణమి కంటే ఎక్కువగా)

సూపర్‌మూన్ అనే పదాన్ని మొదటిసారిగా 1979లో రిచర్డ్ నోల్లె రూపొందించారు, చంద్రుడు భూ కక్ష్యకు దగ్గరగా రావడాన్ని 'పెరిజీ అని అంటారు. దూరంగా ఉండటాన్నిసిసిజీ అని అంటారు. ఆగస్టు 2023లో రెండు సూపర్‌మూన్‌లు ఉండగా, (ఆగస్టు 1)రెండవ పౌర్ణమి భూమికి దగ్గరగా ఉండే చంద్రుడు. ఈ సంవత్సరం మొత్తం నాలుగు సూపర్‌మూన్‌లు ఉన్నాయి, చివరిది సెప్టెంబర్‌లో సంభవిస్తుంది. సూపర్ మూన్ లు ప్రతి రెండేళ్లకు ఒకసారి వస్తుంది.

Tags:    

Similar News