21 ఏళ్ల తర్వాత…!!!
బోగిబీల్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. జాతికి అంకితం చేశారు. ఈ వంతెన నిర్మాణానికి సుదీర్ఘకాలం పట్టింది. 21 సంవత్సరాల తర్వాత వంతెన నిర్మాణం [more]
బోగిబీల్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. జాతికి అంకితం చేశారు. ఈ వంతెన నిర్మాణానికి సుదీర్ఘకాలం పట్టింది. 21 సంవత్సరాల తర్వాత వంతెన నిర్మాణం [more]
బోగిబీల్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. జాతికి అంకితం చేశారు. ఈ వంతెన నిర్మాణానికి సుదీర్ఘకాలం పట్టింది. 21 సంవత్సరాల తర్వాత వంతెన నిర్మాణం పూర్తి చేసుకుంది. 1997లో అప్పటి ప్రధానమంత్రిగా హెచ్.డి.దేవెగౌడ ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు. అయితే అప్పటి నుంచి ఈ వంతెన నిర్మాణపు పనులు మందకొడిగానే సాగుతున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా వంతెన నిర్మాణ పనులను వేగంగా చేపట్టలేకపోయామని చెబుతున్నారు. మొత్తం 4.94 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ వంతెన ధిమజీ-డిబ్రుగడ్ ల మధ్య నిర్మించారు. ఈ వంతెన పూర్తి కావడంతో అరుణాచల్ ప్రదేశ్ కు ప్రయాణ సమయం దాదాపు పదిగంటలు తగ్గుతుంది. బ్రహ్మాపుత్ర నదిపైన నిర్మించిన ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు.