వాళ్లతో కుమ్మక్కయ్యే చార్జీలను పెంచుతున్నారు

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపుదలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరావు మండిపడ్డారు. ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజల నడ్డి విరుస్తుందని బొండా [more]

;

Update: 2021-09-07 07:02 GMT

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపుదలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరావు మండిపడ్డారు. ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజల నడ్డి విరుస్తుందని బొండా ఉమ అన్నారు. గత నెల 700 బిల్లు వచ్చిన ఇంటికి ఇప్పుడు రెండు వేలు వచ్చిందన్నారు. టీడీపీ ఐదేళ్లు అధికారంలో ఉంటే ఏనాడు విద్యుత్ ఛార్జీలను పెంచలేదని బొండా ఉమ గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రయివేటు విద్యుత్తు కంపెనీలతో లాలూచీ పడి విద్యుత్తు ఛార్జీలను పెంచిందని బొండా ఉమ ఆరోపించారు.

Tags:    

Similar News