తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. మంత్రులు కడియం శ్రీహరి, ఈటల రాజేందర్, హరీశ్ రావు లు కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. తెలంగాణలో యాభై శాతానికి పైగా పైబడి ఉన్న బీసీలకు తెలంగాణలో ఆత్మగౌరవ భవనాలను నిర్మించుకునేందుకు 70 ఎకరాల భూమిని కేటాయించాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. రెడ్డి హాస్టల్ భవనానికి మరో ఐదు ఎకరాలు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గోపాల మిత్రల వేతనాలను 8,500లకు పెంచామని మంత్రులు తెలిపారు. ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని 6,500 రూపాయల నుంచి 7,500లకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అర్చకుల రిటైర్మెంట్ వయస్సును 58 నుంచి 65 సంవత్సరాల వయస్సుకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మరో మంత్రివర్గ సమావేశం ఉంటుందని, అందులో కీలక నిర్ణయాలుంటాయని కడియం తెలిపారు.