రాజధానిపై హైకోర్టుకు 37 మంది రైతులు

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం లభించడంతో రాజధాని ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. 37 మంది రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటీషన్ [more]

;

Update: 2020-01-22 04:35 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం లభించడంతో రాజధాని ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. 37 మంది రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ లో కేంద్ర ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి, మంత్రులను ప్రతివాదులగా చేర్చారు. సీఆర్డీఏ రద్దు పైన కూడా మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. దీనికి ప్రతివాదులుగా రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, మంత్రులను చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి తాము అప్పట్లో భూూములు ఇచ్చామని, కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తాము నష్టపోతామని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మరికాసేపట్లో హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

Tags:    

Similar News