నేడు న్యాయమూర్తులపై దూషణ కేసు హైకోర్టులో
ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా పోస్టింగ్ పైన సిబిఐ కేసు నమోదు చేసింది . హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు పలువురు జడ్జి ల పై [more]
;
ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా పోస్టింగ్ పైన సిబిఐ కేసు నమోదు చేసింది . హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు పలువురు జడ్జి ల పై [more]
ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా పోస్టింగ్ పైన సిబిఐ కేసు నమోదు చేసింది . హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు పలువురు జడ్జి ల పై పైన అభ్యంతరకర రీతిలో సోషల్ మీడియా లో పోస్టింగ్ పెట్టారు . ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు పైన ఈ కామెంట్ పెట్టారు. దీనిపై హైకోర్టు గతంలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి 17 మంది పై కేసు నమోదు చేసినట్లు సిబిఐ పేర్కొంది. సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థపై కామెంట్లు చేస్తూ పెద్ద ఎత్తున దూషణలకు దిగారు. గతంలో రిజిస్టర్ స్వయంగా వెళ్లి సిఐడికి ఫిర్యాదు చేశారు. అయితే సీఐడికి ఫిర్యాదు చేసినప్పుడు సరైన రీతిలో అధికారులు స్పందించనందుకు సి.బి.ఐ విచారణకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత నెలలో ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇప్పటికే ఎవరైతే సోషల్ మీడియాలో న్యాయ వ్యవస్థ పైన అనుచితమైన వ్యాఖ్యలు చేశారో వాళ్ళని సిఐడి గుర్తించింది. సిఐడి ఏదైతే పేర్లను నిందితులుగా పేర్కొందో అది పేర్లతో సిబిఐ కొత్తగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.