టీడీపీ టాప్ టెన్ లీడర్స్ లో ఒకరు... మరి తర్వాత?

చదలవాడ అరవింద్ బాబు టీడీపీలో గత రెండేళ్ల నుంచి యాక్టివ్ గా ఉన్నారు. బీసీ నేత కూడా కావడం ఆయనకు కలసి వచ్చింది.

Update: 2022-01-16 03:26 GMT

చదలవాడ అరవింద్ బాబు టీడీపీలో గత రెండేళ్ల నుంచి యాక్టివ్ గా ఉన్నారు. ఆయన డాక్టర్ కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనను ప్రత్యేకంగా నరసరావుపేటకు ఎంపిక చేశారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజవర్గాల్లో యాక్టివ్ గా ఉన్న టాప్ టెన్ నేతల్లో అరవింద్ బాబు ఒకరు. ఆయన కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటారు. ఏ సమస్య వచ్చినా వెంటనే రియాక్ట్ అవుతారు. బీసీ నేత కూడా కావడం ఆయనకు కలసి వచ్చింది.

డాక్టర్ గా....
చదలవాడ అరవింద్ బాబు ఆర్థోపెడిక్ సర్జన్ గా నరసరావుపేట ప్రాంత వాసులకు సుపరిచతం. అందుకే ఆయనను 2019 ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతిలో అరవింద్ బాబు దాదాపు 30 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. టీడీపీ ఒంటరిగా పోటీ చేయడం వల్లనే అరవింద్ బాబుకు ఎక్కువ ఓట్లు పోలవ్వలేదన్న విశ్లేషణలు వినపడుతున్నాయి.
రెండు దశాబ్దాల నుంచి...
నరసరావుపేటలో దాదాపు రెండు దశాబ్దాల నుంచి టీడీపీకి విజయం లభించలేదు. 1999లో టీడీపీకి చివరి గెలుపు దక్కింది. 1983 నుంచి 1999 వరకూ వరసగా కోడెల శివప్రసాదరావు ఐదు సార్లు విజయం సాధించి నరసరావుపేటను టీడీపీకి కంచుకోటగా మలిచారు. ఆ తర్వాత వరసగా రెండుసార్లు కాంగ్రెస్, రెండుసార్లు వైసీపీ విజయం సాధించాయి. 2014 ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు ఉండటంతో ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు.
క్యాడర్ కు ....
ఇక 2019 ఎన్నికల్లో ఓటమి పాలయిన నాటి నుంచి చదలవాడ అరవింద్ బాబు పార్టీ కార్యక్రమాలను వదిలిపెట్టడం లేదు. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలతో పాటు నరసరావు పేటలో స్థానిక సమస్యలపైనా ఆయన స్పందిస్తున్నారు. కోడెల తరహాలోనే పగలు, రాత్రి లేకుండా కార్యకర్తలతో మమేకం అవుతున్నారు. తాజాగా నిన్న కూడా పోలీసులు దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్ప పొందుతున్నారు.
పొత్తు ఉంటే?
అయితే ఇక్కడ ట్టిస్ట్ ఏంటంతే వచ్చే ఎన్నికలలో టీడీపీ పొత్తుతో వెళితే అరవింద్ బాబు పరిస్థితి ఏంటన్న ఆందోళన ఆయన అభిమానులను పట్టిపీడిస్తుంది. టీడీపీ ఈ స్థానాన్ని చదలవాడ అరవింద్ బాబుకు కేటాయిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న అంచనాలు వినపడుతున్నాయి.


Tags:    

Similar News