బ్రేకింగ్: దిగివచ్చిన బాబు సర్కార్

ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ విషయంలో ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం దిగివచ్చింది. ఆయనను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈసీ [more]

Update: 2019-03-29 08:56 GMT

ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ విషయంలో ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం దిగివచ్చింది. ఆయనను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆయనను బదిలీ చేస్తూ జీఓ ఇచ్చింది. తర్వాత మళ్లీ ఆ జీఓను రద్దు చేస్తూ మరో జీఓ ఇచ్చి వెంకటేశ్వరరావును విధుల్లో కొనసాగించింది. ఎన్నికల సంఘం నిర్ణయం తప్పని ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే, హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సంఘం నిర్ణయంలో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. దీంతో ముఖ్యమంత్రితో వెంకటేశ్వరరావు సుదీర్ఘంగా సమావేశమై చర్చించారు. ఇక, ఈసీ నిర్ణయాన్ని పాటించక తప్పదని నిర్ణయానికి వచ్చి మరో జీఓ జారీ చేశారు. వెంకటేశ్వరరావును బదిలీ చేసి హెడ్ క్వార్టర్స్ కు రిపోర్టు చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. కాగా, హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళతామని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చెప్పినా ఎందుకో చంద్రబాబు వెనక్కుతగ్గినట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News