తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలపై ఫైరయ్యారు. రెండు రోజుల పాటు అనంతపురంలో పర్యటిస్తున్న చంద్రబాబు జిల్లాలో గ్రూపులు ఎక్కువై పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారన్నారు. వారసుల కోసం పార్టీని తాకట్టు పెట్టేలా నాయకులు వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా నేతలతో జరిగిన సమావేశంలో తప్పుపట్టినట్లు తెలిసింది. ఎన్ని సార్లు చెప్పినా ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారే తప్ప పార్టీని పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యకత్ం చేశారు.
సర్వేల ఆధారంగానే.....
పార్టీని గ్రూపు రాజకీయాలతో భ్రష్టు పట్టిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన అనంత నేతలకు వార్నింగ్ ఇచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కోరినంత మాత్రాన తాను వారసులకు టిక్కెట్ ఇవ్వబోనని, సర్వేల ఆధారంగానే టిక్కెట్లు కేటాయింపు ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలని సీరియస్ గా చెప్పారు. జిల్లలో పరిటాల, జేసీ కుటుంబాలు వర్గాలుగా విడిపోవడం, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పడకపోవడాన్ని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు ఈ వ్యాఖ్యలను చేసినట్లు తెలుస్తోంది.