చంద్రబాబు ‘సంతకం’ మిస్సింగ్‌!

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంకి సంబంధించిన ఫైళ్లలో చంద్రబాబు ఎక్కడా సంతకం చేయలేదని తెలుగుదేశం నాయకులు వాదిస్తున్నారు. కానీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో 13 చోట్ల ఆయన ‘స్కిల్‌’ ఫైల్స్‌పై సంతకం చేశారని సీఐడీ అధికారులు ఆధారాలతో సహా చూపిస్తున్నారు. ఈ సంగతి ఎలా ఉన్నా, సంక్షేమ పథంలో తెలుగు రాష్ట్రాలో చంద్రబాబు సంతకం మిస్సయింది. ఆ ప్రభావం ప్రతీ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీపై కనిపిస్తోంది. పొత్తులతో పోటీ చేస్తే అత్తెసరు మార్కులతో ఆయన పాసవుతున్నారు. విడిగా ఎన్నికల బరిలోకి దిగితే, చిత్తుగా ఓడిపోతున్నారు. అభివృద్ధిని కేవలం హైదరాబాద్‌కే పరిమితంచేయడం, పేదల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిన ఫలితం ఇది.

Update: 2023-11-18 03:17 GMT

సంక్షేమ పథకాల్లో కనిపించని బాబు మార్కు 

అభివృద్ధి కూడా హైదరాబాద్ వరకే పరిమితం  

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంకి సంబంధించిన ఫైళ్లలో చంద్రబాబు ఎక్కడా సంతకం చేయలేదని తెలుగుదేశం నాయకులు వాదిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి హోదాలో 13 చోట్ల ఆయన ‘స్కిల్‌’ ఫైల్స్‌పై సంతకం చేశారని సీఐడీ అధికారులు ఆధారాలతో సహా చూపిస్తున్నారు. ఈ సంగతి ఎలా ఉన్నా, సంక్షేమ పథంలో తెలుగు రాష్ట్రాలో చంద్రబాబు సంతకం మిస్సయింది. ఆ ప్రభావం ప్రతీ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీపై కనిపిస్తోంది. పొత్తులతో పోటీ చేస్తే అత్తెసరు మార్కులతో ఆయన పాసవుతున్నారు. విడిగా ఎన్నికల బరిలోకి దిగితే, చిత్తుగా ఓడిపోతున్నారు. అభివృద్ధిని కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేసి, పేదల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిన ఫలితం ఇది.

చంద్రబాబునాయుడిని ఐటీ పితామహుడిగా చాలామంది కీర్తిస్తుంటారు. ఆయనను అభివృద్ధి చోదకుడిగా మీడియా అభివర్ణిస్తుంటుంది. ఆధునిక హైదరాబాద్‌ ఆయన కృషి పుణ్యమే అని వాదించేవాళ్లు ఆంధ్రలోనే కాదు తెలంగాణలో కూడా ఉన్నారు. బెంగళూరు, చెన్నయ్‌ లాంటి నగరాలు ఐటీలో బాగా పురోగమించినా... చంద్రబాబుకి వచ్చినంత క్రెడిట్‌ మరే ముఖ్యమంత్రికీ రాలేదు. ఇంత దార్శనికుడు కూడా ఏ ఎన్నికల్లోనూ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోవడం ఆయన అభిమానులకు మింగుడు పడటం లేదు. ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం విజయం సాధించిన రెండు సార్లూ (1999, 2014) వేరే పార్టీలతో పొత్తులోనే ఉంది. సింగిల్‌గా ఫైట్‌ చేసి పార్టీని గెలిపించుకున్న సందర్భాలు లేవు. అందుకే ఈ సారి కూడా జనసేన, భాజపాతో పొత్తు కోసం సైకిల్‌ పార్టీ తహతహ లాడుతోంది.

ఫార్టీ ఇయర్స్‌ ఇన్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పొత్తు లేకుండా ఎందుకు ఎన్నికల రణరంగంలోకి దిగలేకపోతున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం పెద్ద కష్టమేం కాదు. తన హయాంలో పేదవాడికి గుర్తుండిపోయేలా ఏ సంక్షేమ పథకానికీ ఆయన శ్రీకారం చుట్టలేకపోయారు. తెలుగుదేశం శ్రేణులు అవునన్నా, కాదన్నా ఇది కాదనలేని వాస్తవం. జనాల్లో చెరగని ముద్ర వేసిన ప్రతీ నాయకుడు సంక్షేమ పథంలో పయనించిన వాళ్లే. తమదైన సిగ్నేచర్‌తో జనం గుండెల్లో నిలిచిన పోయిన వాళ్లే.

రెండు రూపాయలకు కిలో బియ్యం, స్త్రీలకు ఆస్తి హక్కు లాంటి పథకాలతో ఎన్టీయార్‌ జ.నం మన్నన పొందారు. ఉచిత విద్యుత్‌, ఆరోగ్య శ్రీ, విద్యార్థులకు ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ వంటి పథకాలతో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజల జ్ఞాపకాల్లో చిరకాలం మిగిలిపోతారు. దళితబంధు, రైతుబంధు, పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు వంటి పథకాలు కేసీయార్‌, తెలంగాణ పేదలు గర్వంగా చెప్పుకునే పథకాలు. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌, వాలంటీర్‌ వ్యవస్థ, సచివాలయాలు.. జగన్‌మోహన్‌రెడ్డి మార్కు సంతకాలు. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పథకాలను రద్దు చేయలేదు. మార్పులు చేర్పులూ ఉండచ్చేమో కానీ, ఈ నేతలు ప్రారంభించిన పథకాలు మాత్రం శాశ్వతం.

ఎన్టీయార్‌, వైఎస్సార్‌, కేసీయార్‌, జగన్‌లాగా జనం గుర్తుంచుకునే సంక్షేమ పథకాలకు చంద్రబాబు రూపకల్పన చేయలేకపోయారు. అభివృద్ధిలో అగ్రగణ్యుడని చెప్పుకుంటున్నా, అది కేవలం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైంది. ఆయన హయాంలో సీమాంధ్రలో పట్టణాలూ, పల్లెల రూపురేఖలు పెద్దగా మారలేదు. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. అన్న క్యాంటీన్‌, సంక్రాంతి, క్రిస్మస్‌, రంజాన్‌ కానుకలంటూ రేషన్‌ సరుకులు ఉచితంగా అందించినా, అవి జనం మెప్పు పొందలేకపోయాయి. ఆ ప్రభావం 2019 ఎన్నికల్లో కనిపించింది. జనానికి చెప్పే మాటలు గుర్తుండవు. చేసే పనులు మాత్రమే జ్ఞాపకం ఉంటాయి. చెప్పే మాటలనే ఆచరణలో చూపించగలితే ఆ నాయకులకు తిరుగుండదు.

Tags:    

Similar News