ఏ కుటుంబానికైనా ఏపీలో భద్రత ఉందా?
పోలీసుల వేధింపుల వల్లే అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. దీనిపై కేసు ఎలా పెట్టాలో ఐఏఎస్ అధికారులకు తెలియదా? అని [more]
;
పోలీసుల వేధింపుల వల్లే అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. దీనిపై కేసు ఎలా పెట్టాలో ఐఏఎస్ అధికారులకు తెలియదా? అని [more]
పోలీసుల వేధింపుల వల్లే అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. దీనిపై కేసు ఎలా పెట్టాలో ఐఏఎస్ అధికారులకు తెలియదా? అని ప్రశ్నించారు. 42 రోజుల పాటు సలాంను జైలులో పెట్టారన్నారు. ఐఏఎస్ అధికారులతో కమిటీ వేయడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. అమరావతి రైతులపైన కూడా అక్రమంగా కేసులు పెట్టారన్నారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. దళితులు, మైనారిటీలకు వైసీపీ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రశ్నిస్తే పోలీసులు ఎదురు ఆధారాలు అడుతున్నారన్నారు. సలాం కేసులో సెక్షన్లు సరిగా పెట్టకుండా టీడీపీపై నిందలు వేస్తారా? అని చంద్రబాబు నిలదీశారు. ఈ సంఘటనలు చూస్తుంటే రాష్ఠ్రంలో ఏ కుటుంబానికైనా భద్రత ఉందా? అని చంద్రబాుబ ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు జగన్ సమాధానం చెప్పాలన్నారు.