బ్రేకింగ్ : బాబు సభలో ఊగిపోయారు… తొలిసారి?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. ఇటీవల తుపాను వల్ల నష్టపోయిన బాధితులకు నష్ట పరిహారం పంపిణీపై సభలో టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. ఇంకా [more]
;
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. ఇటీవల తుపాను వల్ల నష్టపోయిన బాధితులకు నష్ట పరిహారం పంపిణీపై సభలో టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. ఇంకా [more]
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. ఇటీవల తుపాను వల్ల నష్టపోయిన బాధితులకు నష్ట పరిహారం పంపిణీపై సభలో టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. ఇంకా నష్టం వివరాలపై అంచనాలు జరుగుతున్నాయని, డిసెంబరు 15వ తేదీ నాటికి పూర్తవుతుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ జరుగుతుంటే అంచానాలు చెప్పమనడమేంటని? అడిగే వారికి మెదడు ఉందా? అని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు మాట్లేడేందుకు అవకాశమివ్వాలని కోరారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడునే మాట్లాడాలని పదే పదే చెప్పగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఉదుటున సీటు నుంచి లేచి చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. ఆగ్రహంతో ఊగిపోయారు. తనకు మాట్లాడేందుకు వకాశమివ్వాల్సిందేనని పట్టుబట్టారు. స్పీకర్ పోడియం ముందు చంద్రబాబు బైఠాయించాారు.