గాలికొచ్చినోళ్లు గాలికేపోతారు?

శాసనసభలో సీఎం తీరు సమర్థనీయంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అందువల్లనే తాను పోడియం వద్దకు వెళ్లానని చెప్పారు. సభలో జగన్ ప్రవర్తించిన తీరుకు తనకు [more]

;

Update: 2020-11-30 11:57 GMT

శాసనసభలో సీఎం తీరు సమర్థనీయంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అందువల్లనే తాను పోడియం వద్దకు వెళ్లానని చెప్పారు. సభలో జగన్ ప్రవర్తించిన తీరుకు తనకు కోపం వచ్చిందన్నారు. వరదలతో రైతులు అల్లాడిపోతుంటే, దాని మీద చర్చ జరపమంటే మాటల దాడి చేస్తారా? అని చంద్రబాబు మండి పడ్డారు. కోతకొచ్చిన పంట వరదపాలయిందన్నారు. ప్రభుత్వానివన్నీ మోసపూరిత ప్రకటనలేనని చెప్పారు. గాలికి వచ్చిన వాళ్లు గాలికే పోతారని చంద్రబాబు శాపనార్థాలు పెట్టారు. గాల్లో తిరిగి గాలి కబుర్లు చెప్పడం కాదన్నారు. వరద నష్టంపై ప్రభుత్వం కబుర్లు చెబుతుందన్నారు. పంట బీమా ప్రీమియం కూడా ప్రభుత్వం చెల్లించలేదన్నారు. ప్రీమియం పే చేయకుండా ఉండే బీమా వ్యవస్థను నాశనం చేశారన్నారు. జగన్ ఒక ఫేక్ ముఖ్యమంత్రి అని అన్నారు. ఎవరిచ్చారు మీకీ అధికారాన్ని ప్రశ్నించారు. ఏం చూసి ప్రజలు వీళ్లకు ఓటేశారో తనకు తెలియదు కాని, దాని ఫలితాన్ని తాను అనుభవిస్తున్నానని చెప్పారు. నేరగాళ్ల చేత అవమానం పాలు కావాల్సి వస్తుందన్నారు. ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు. అమరావతిని నాశనం చేస్తారా? అని నిలదీశారు. 21 ఏళ్ల క్రితమే తాను జినోమ్ వ్యాలిని ప్రారంభించానని చెప్పారు. విశాఖలో జరిగింది ఇన్ సైడ్ ట్రేడింగ్ కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికలు ఇంకా రెండేళ్లలో రావచ్చని, గుర్తుపెట్టుకోవాలని కోరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డినే ఎదిరించానని చెప్పారు. వైఎస్ కు ప్రజలంటే భయముందని, ఇతనికి భయం లేదన్నారు. ప్రజాస్వామ్యం అంటే విలువ లేకుండా పోయిందని, ఇది బాగా లేదని, హెచ్చరిస్తున్నానని చంద్రబాబు అన్నారు. సస్పెండ్ చేసింది తమను కాదని, రైతులను అని చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News