జగన్ కు చంద్రబాబు లేఖ.. జేసీ విషయంలో

ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తాడిపత్రిలో శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పారు. రాష్ట్రంలో రూల్ ఆఫ‌ లా లేదనడానికి తాడిపత్రి ఘటన ఉదాహరణ [more]

;

Update: 2020-12-29 03:49 GMT

ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తాడిపత్రిలో శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పారు. రాష్ట్రంలో రూల్ ఆఫ‌ లా లేదనడానికి తాడిపత్రి ఘటన ఉదాహరణ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత ఇంటికి వెళ్లి దాడి చేయడం ఇదే తొలిసారి అని చంద్రబాబు పేర్కొన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గ్యాంగ్ దాడికి పాల్పడటం హేయమని అన్నారు. తిరిగి జేసీ కుటుంబసభ్యులపై కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. జేసీ కుటుంబానికి రక్షణ కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News