గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిందే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పాలనను చక్కదిద్దాలని [more]
;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పాలనను చక్కదిద్దాలని [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పాలనను చక్కదిద్దాలని చంద్రబాబు గవర్నర్ ను లేఖలో కోరారు. అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పోలీసులు కొందరు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కవ్వడంతో రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన రెండు వీడియోలను చంద్రబాబు గవర్నర్ కు పంపారు. వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.