దాదాపు ఏడాది తర్వాత చంద్రబాబు విశాఖకు?
దాదాపు ఏడాది తర్వాత చంద్రబాబు విశాఖకు రానున్నారు. 2020 ఆరంభంలో చంద్రబాబు విశాఖకు వచ్చేందుకు ప్రయత్నించారు. వైసీపీ భూ బాగోతాన్ని బయటపెట్టేందుకు తాను వస్తున్నానని ప్రకటించారు. అయితే [more]
;
దాదాపు ఏడాది తర్వాత చంద్రబాబు విశాఖకు రానున్నారు. 2020 ఆరంభంలో చంద్రబాబు విశాఖకు వచ్చేందుకు ప్రయత్నించారు. వైసీపీ భూ బాగోతాన్ని బయటపెట్టేందుకు తాను వస్తున్నానని ప్రకటించారు. అయితే [more]
దాదాపు ఏడాది తర్వాత చంద్రబాబు విశాఖకు రానున్నారు. 2020 ఆరంభంలో చంద్రబాబు విశాఖకు వచ్చేందుకు ప్రయత్నించారు. వైసీపీ భూ బాగోతాన్ని బయటపెట్టేందుకు తాను వస్తున్నానని ప్రకటించారు. అయితే విశాఖలో పరిపాలన రాజథానిని అడ్డుకునేందుకే చంద్రబాబు వస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ నిరసనకు దిగాయి. దీంతో విశాఖ ఎయిర్ పోర్టులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు చంద్రబాబును విశాఖ ఎయిర్ పోర్టు నుంచి వెనక్కు పంపారు. తర్వాత గత ఏడాది మే నెలలో ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ ఘటన జరిగినప్పుడు విశాఖకు వచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. కేంద్ర ప్రభుత్వానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో లాక్ డౌన్ అమలులో ఉండటంతో అది సాధ్యం కాలేదు. దాదాపు ఏడాది తర్వాత చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టుకు నేడు చేరుకున్నారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన విశాఖపట్నంకు వచ్చారు.