జగన్ కు వాటికన్ సిటీ అంటేనే ఇష్టం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వాటికన్ సిటీ అంటేనే ఇష్టమని, అమరావతి అంటే ద్వేషమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన టీడీపీ రాష్ట్ర కమిటీ సమావేశంలో [more]
;
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వాటికన్ సిటీ అంటేనే ఇష్టమని, అమరావతి అంటే ద్వేషమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన టీడీపీ రాష్ట్ర కమిటీ సమావేశంలో [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వాటికన్ సిటీ అంటేనే ఇష్టమని, అమరావతి అంటే ద్వేషమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన టీడీపీ రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడారు. అమరావతి ప్రాంతం దేవుళ్లు నడియాడన ప్రాంతమని చంద్రబాబు చెప్పారు. అటువంటి అమరావతిని శ్మశానం చేసేందుకు జగన్ పూనుకున్నారన్నారు. దేవాలయాలపై దాడులు జరుగుతున్నా సీఎం స్పందించరా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతి అంటే జగన్ కు అంత కంపరమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఆరోజు రాజీనామాలు చేసిన జగన్ నేడు 22 మంది ఎంపీలతో ఏం చేస్తున్నారని నిలదీశారు. పాస్టర్లకు ఐదు వేలు ఇవ్వడం చట్టవిరుద్దమని చంద్రబాబు అన్నారు. మన దేవాలయాలను మనమే కాపాడుకుందామని చంద్రబాబు పిలుపు నిచ్చారు.