తిరుపతిలో ఎలాగైనా గెలవాల్సిందే

తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని, అందుకు అందరూ సమిష్టిగాకృషి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ ఎన్నిక ద్వారానే వైసీపీ ప్రభుత్వానికి [more]

;

Update: 2021-01-20 01:19 GMT

తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని, అందుకు అందరూ సమిష్టిగాకృషి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ ఎన్నిక ద్వారానే వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. ఆయన తిరుపతి పార్లమెంటు పరిధిలోని అనేక మంది టీడీపీ నేతలతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు కొత్తగా ఒక్కటైనా వచ్చాయా? అని ప్రశ్నించారు. అలాగే మతమార్పిడులు రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. తిరుపతిలో గెలుపునకు ప్రతి ఒక్క కార్యకర్త శ్రమించాల్సిందేనని తెలిపారు. ప్రతి విషయాన్ని ప్రజలకు వివరించి వారిలో చైతన్యం తేవాలని చంద్రబాబు కోరారు.

Tags:    

Similar News