నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంటు సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించనున్నారు. ప్రధానంగా వైసీపీ [more]
;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంటు సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించనున్నారు. ప్రధానంగా వైసీపీ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంటు సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించనున్నారు. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న వైఖరిని పార్లమెంటు సాక్షిగా ఎండగట్టాలని టీడీపీ భావిస్తుంది. ఆలయాలపై దాడులు, అక్రమ కేసులు వంటివి సభలో లేవనెత్తేందుకు ప్రయత్నించాలని చంద్రబాబు పార్టీ ఎంపీలకు చెప్పనున్నారు. టీడీపీకి ముగ్గురు పార్లమెంటు సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్న సంగతి తెలిసిందే.