చంద్రబాబు పర్యటనకు ముందే విజయసాయి

విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశముంది. చంద్రబాబు పర్యటించే సమయంలోనే వైసీపీ నేతలు కూడా రామతీర్థంకు రానున్నారు. రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసమయిన [more]

;

Update: 2021-01-02 04:29 GMT

విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశముంది. చంద్రబాబు పర్యటించే సమయంలోనే వైసీపీ నేతలు కూడా రామతీర్థంకు రానున్నారు. రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసమయిన ఆలయాన్ని పరిశీలించేందుకు చంద్రబాబు వస్తున్నారు. చంద్రబాబు మధ్యాహ్నం 12 గంటలకు రామతీర్థం చేరుకునే అవకాశాలున్నాయి. అయితే ఇదే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు సయితం రామతీర్థం పర్యటించనున్నట్లు తెలిసింది. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తే అవకాశాలున్నాయి. పోలీసులు ఈ సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News