దర్గాకు నిప్పు… చంద్రబాబు ఆగ్రహం

చిత్తూరు జిల్లాలో దర్గా దగ్దం అయింది. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని చంద్రబాబు అన్నారు. మొన్నటి వరకూ [more]

;

Update: 2021-01-18 01:33 GMT

చిత్తూరు జిల్లాలో దర్గా దగ్దం అయింది. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని చంద్రబాబు అన్నారు. మొన్నటి వరకూ ఆలయాలపై దాడులకు దిగిన దుండగులు ఇప్పుడు దర్గాల వైపు మళ్లారని, నేరగాళ్ల బరితెగింపుకు ఇది నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ అండ చూసుకునే నేరగాళ్లు రెచ్చిపోతున్నారని చంద్రబాబు అన్నారు. దర్గాకు నిప్పుపెట్టిన వారిని గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News