చంద్రబాబు@సెంట్రల్‌ జైల్‌

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని అత్యంత భద్రత మధ్య రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలిస్తున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో ఆయనను శనివారం సీఐడీ అధికారులు నంద్యాలలో అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. హోరా హోరీ వాదనల తర్వాత తెదేపా అధ్యక్షుడికి సీబీఐ కోర్టు సెప్టెంబర్‌ 22 వరకూ రిమాండ్‌ విధించింది.

Update: 2023-09-10 17:02 GMT

భారీ భద్రత మధ్య రాజమండ్రికి తరలింపు 

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని అత్యంత భద్రత మధ్య రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలిస్తున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో ఆయనను శనివారం సీఐడీ అధికారులు నంద్యాలలో అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. హోరా హోరీ వాదనల తర్వాత తెదేపా అధ్యక్షుడికి సీబీఐ కోర్టు సెప్టెంబర్‌ 22 వరకూ రిమాండ్‌ విధించింది. అయితే తనకు గృహ నిర్బంధం మంజూరు చేయాలని, భోజనం, మందులు ఇంటి నుంచి తెచ్చుకునే వెసులుబాటు కల్పించాలని చంద్రబాబు నాయుడు రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై కూడా ఏసీబీ కోర్టు ఆదివారం రాత్రి తీర్పు వెల్లడిరచింది. చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ప్రత్యేక వసతిని కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు భోజనాన్ని, మందులను ఇంటి నుంచి అందించడానికి అనుమతించాలని జైలు అధికారులను ఆదేశించింది. గృహ నిర్బంధానికి అనుమతించాలని చంద్రబాబు వేసిన పిటిషన్‌ విచారణను సోమవారానికి వాయిదే వేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌కు తరలిస్తున్నారు. ఆయనకు జడ్‌ ప్లస్‌ భద్రత ఉండటంతో, సొంత కాన్వాయ్‌లోనే రాజమండ్రికి తీసుకు వెళ్తున్నారు. విజయవాడ కోర్టు వద్ద అభిమానులకు అభివాదం చేసి తెదేపా అధ్యక్షుడు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు బయల్దేరారు. చంద్రబాబు కాన్వాయ్‌తో నారా లోకేష్‌ కూడా బయల్దేరారు.

తెలుగుదేశం బంద్‌కు జనసేన మద్దతు

చంద్రబాబు అరెస్ట్‌, రిమాండ్‌కు నిరసనగా తెలుగుదేశం పార్టీ సోమవారం తలపెట్టిన బంద్‌కు జనసేన పార్టీ సంఫీుభావం ప్రకటించింది. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్వం చేసి, వైకాపా ప్రభుత్వం ప్రజా కంటక పాలనకు ఒడిగడుతోందని జనసేనాని ఓ ప్రకటనలో ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపులతో కేసులు, అరెస్టులకు వైసీపీ ప్రభుత్వం పాల్పడుతోందని ఆయన విమర్శించారు. సోమవారం జరగబోయే బంద్‌లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనాలని ఆయన కోరారు.

Tags:    

Similar News