రాజ్ భవన్ లో ప్రజాదర్బార్.. కేసీఆర్ కు గవర్నర్ మరో ఝలక్
రాజ్ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు కూడా దూరంగా ఉన్నారు.
రాజ్ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు కూడా దూరంగా ఉన్నారు. కేవలం అధికారులు రాజకీయ పార్టీల నేతలు మాత్రమే హాజరయ్యారు. ఉగాదికి రాజ్ భవన్ లో వేడుకలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తుంది. ఈ వేడుకలకు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా హాజరవుతారు. కానీ గత కొంతకాలంగా రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య గ్యాప్ ఏర్పడింది.
బడ్జెట్ సమావేశాలకు...
బడ్జెట్ సమావేశాల ప్రసంగానికి కూడా గవర్నర్ తమిళిసైను ప్రభుత్వం దూరంగా ఉంచింది. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించారు. దీనిపై ఎవరి వాదనలను వారు వినిపించారు. అయితే అప్పటి నుంచి గవర్నర్ కు, సీఎంకు మధ్య గ్యాప్ పెరిగిందంటున్నారు. కేసీఆర్ బీజేపీపై వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమానికి సిద్దమవ్వడం, గవర్నర్ తాను పంపిన కౌశిక్ రెడ్డి ఫైలును తిరస్కరించడం వంటి కారణాలతో కేసీఆర్ కు, గవర్నర్ కు గ్యాప్ పెరిగింది.
వచ్చే నెల నుంచి ప్రజాదర్బార్
చివరకు మేడారం జాతర కు వచ్చిన గవర్నర్ కు ప్రొటోకాల్ ను పాటించకుండానే మంత్రులంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేవలం అధికారులు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను స్ట్రాంగ్ పర్సన్ ని అని, ఎవరికీ లొంగనని చెప్పారు. వచ్చే నెల నుంచి రాజ్ భవన్ లో ప్రజాదర్బార్ ను నిర్వహిస్తానని కూడా తమిళి సై వెల్లడించారు. గవర్నర్ గా తన పరిమితులు తెలుసునని, తనను ఎవరూ నియంత్రించలేరని కూడా ఆమె పేర్కొన్నారు.