కళ్లు బైర్లు కమ్మాయి..అందుకే పారిపోయా

నార్సింగ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు తానే నడిపానని సినీ హీరో రాజ్ తరుణ్ తెలిపారు. తాను ఎక్కడికీ పారిపోలేదన్నారు. తాను మూడు నెలలుగా ఇదే [more]

;

Update: 2019-08-21 06:35 GMT

నార్సింగ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు తానే నడిపానని సినీ హీరో రాజ్ తరుణ్ తెలిపారు. తాను ఎక్కడికీ పారిపోలేదన్నారు. తాను మూడు నెలలుగా ఇదే రోడ్డులో ప్రయాణిస్తున్నానని రాజ్ తరుణ్ చెప్పారు. సడెన్ గా టర్నింగ్ రావడంతో కారు అదుపు తప్పి గోడను ఢీకొట్టిందన్నారు. తాను కారు నడిపేటప్పుడు సీటు బెల్టు ధరించానని చెప్పారు. కారు ప్రమాదానికి గురికాగానే పెద్ద శబ్దం వచ్చిందని, భయపడి కళ్లు బైర్లు కమ్మాయని రాజ్ తరుణ్ చెప్పారు. అందుకే భయపడి తాను ఇంట్లోకి పారిపోయానని తెలిపారు. తాను క్షేమంగానే ఉన్నానని, కొద్దిరోజుల్లో షూటంగ్ లో పాల్గొంటానని తెలిపారు.

Tags:    

Similar News