కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా విడుదలైనా అనేక మంది నాయకులకు ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదు. పలువురు నాయకుల సీట్లను అధిష్ఠానం ఇంకా ఫైనల్ చేయలేదు. మిత్రపక్షాలకు కేటాయించే సీట్లు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 75 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 19 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దీంతో నాయకుల ఎదురుచూపులు ఇంకా తప్పడం లేదు. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సబిత ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆశిస్తున్న స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు.
చివరి ప్రయత్నాల్లో.....
దీంతో వీరంతా ఢిల్లీలో చివరి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు సుమారు 10 సీట్లు ఆశించగా వారిలో మొదటి జాబితాలో మేడిపల్లి సత్యంకి మాత్రమే టిక్కెట్ దక్కింది. ధర్మపురి టిక్కెట్ ను విద్యార్థి నేత దరువు ఎల్లన్న ఆశించినా ఆయనకు మొండిచేయి చూపారు. ఈ స్థానాన్ని లక్ష్మణ్ కుమార్ కి కేటాయించారు.