11 కోట్లు ఆన్ లైన్ ద్వారా హాంఫట్
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ లో 11 కోట్ల కు ఒక వ్యాపారికి టోకరా వేశారు. ఫారెస్ట్ ఆయిల్ ను సరఫరా చేస్తామని నమ్మబలికారు. వ్యాక్సిన్ లో [more]
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ లో 11 కోట్ల కు ఒక వ్యాపారికి టోకరా వేశారు. ఫారెస్ట్ ఆయిల్ ను సరఫరా చేస్తామని నమ్మబలికారు. వ్యాక్సిన్ లో [more]
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ లో 11 కోట్ల కు ఒక వ్యాపారికి టోకరా వేశారు. ఫారెస్ట్ ఆయిల్ ను సరఫరా చేస్తామని నమ్మబలికారు. వ్యాక్సిన్ లో ఉపయోగించే ఆయిల్ ను తాము సరఫరా చేస్తామని చెప్పారు. అమెరికాలో తాము వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పేరుతో గీతానారాయణ పేరుతో పరిచయమైన వారు విడతల వారీగా 11కోట్లు ఆన్ లైన్ లో తమ ఖాతాలో వేయించుకున్నారు. దీనిపై బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.