విజయసాయిరెడ్డికి దగ్గుబాటి ఫోన్

మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరావు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. తాము రాజకీయాలకు దూరంగా ఉండదలచుకున్నామని, వైసీపీకి రాజీనామా చేస్తున్నామని తెలిపారు. రాజీనామా విషయంలో [more]

Update: 2019-10-28 12:18 GMT

మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరావు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. తాము రాజకీయాలకు దూరంగా ఉండదలచుకున్నామని, వైసీపీకి రాజీనామా చేస్తున్నామని తెలిపారు. రాజీనామా విషయంలో ఎవరినీ కలిసేది లేదని కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన రావి రామనాధం బాబును పార్టీలో తీసుకుంటున్న విషయాన్ని కూడా ఎవరూ తనతో చర్చించలేదని దగ్గుబాటి వెంకటేశ్వరరావు విజయసాయిరెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. తనతో పాటు తన కుమారుడు దగ్గుబాటి హితేశ్ కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన విజయసాయిరెడ్డితో చెప్పినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News