బ్రేకింగ్ : మూడు రాజధానుల బిల్లుపై హైకోర్టులో

అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టులో కొద్దిసేపటి క్రితం విచారణ జరిగింది. రాజధాని ఎక్కడ ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని వేసిన పిటీషన్ ను [more]

;

Update: 2020-07-23 06:41 GMT

అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టులో కొద్దిసేపటి క్రితం విచారణ జరిగింది. రాజధాని ఎక్కడ ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని వేసిన పిటీషన్ ను విచారించిన హైకోర్టు కేంద్ర, ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని హైకోర్టుకోరింది. ఈ విచారణను ఆగస్టు 6వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు నిర్మాణాలను పూర్తి చేయాలని దాఖలైన పిటీషన్ పై కూడా హైకోర్టు సున్నితంగా వ్యాఖ్యానించింది. ఒకవేళ ప్రభుత్వం వ్యాజ్యాల్లో గెలిస్తే హైకోర్టును కూడా తరలించాలి కదా? అని పిటీషనర్ ను ప్రశ్నించింది.

Tags:    

Similar News