వైరల్ అవుతున్న దీప్తి సునయన్ స్టేటస్.. షన్ను కోసమేనా ?

సిరి, షన్ను లు తమ పర్సనల్ లైఫ్ లో వేర్వేరు వ్యక్తులతో రిలేషన్ షిప్ లో ఉన్నప్పటికీ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతున్నామని ఇద్దరూ హౌస్ లోనే అంగీకరించారు. ఆ తర్వాత అటు సిరి మదర్

Update: 2021-12-23 12:42 GMT

బిగ్ బాస్.. ఈ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని భాషల్లోనూ ప్రేక్షకాదరణ పొందుతోన్న ఏకైక రియాలిటీ షో ఇది. ఈ హౌస్ లోకి వెళ్లొచ్చిన వారికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే ముగిసింది. కప్పు ముఖ్యం బిగిలూ అంటూ సన్నీ కప్పును గెలుచుకున్నాడు. ఇక షన్ను రన్నరప్ గా నిలిచాడు. సన్నీ, షణ్ముఖ్ మధ్య జరిగిన టైటిల్ పోరు.. క్షణక్షణం మారిపోయిన ఓటింగ్స్‏తో బిగ్‏బాస్ విజేత ఎవరనేది విషయంపై ప్రేక్షకులను ఆసక్తి చూపించారు. అయితే ఈసారి సీజన్‏లో సిరి, షణ్ముఖ్ స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరి ఆటను కనిపెడుతూ.. గేమ్ ప్లాన్స్ చేస్తూ.. బిగ్‏బాస్ బ్రహ్మగా పేరు తెచ్చుకున్నాడు షణ్ముఖ్. అయితే బిగ్‏బాస్‏లోకి షన్నూ ఎంట్రీ ఇవ్వగానే టైటిల్ అతనికే అనుకున్నారు అందరూ. కానీ ఎక్కువగా ఆలోచించడం.. సిరితో పదే పదే హగ్గులు.. ముద్దులు చేస్తుండడంతో షన్నూ పూర్తిగా నెగిటివిటిని సంపాదించుకుని రన్నరప్ గా మిగిలిపోయాడు.

ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ

సిరి, షన్ను లు తమ పర్సనల్ లైఫ్ లో వేర్వేరు వ్యక్తులతో రిలేషన్ షిప్ లో ఉన్నప్పటికీ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతున్నామని ఇద్దరూ హౌస్ లోనే అంగీకరించారు. ఆ తర్వాత అటు సిరి మదర్, ఇటు షన్ను మదర్ ఫ్యామిలీ ఎపిసోడ్ లో వచ్చి చురకలంటించినా.. వీరిద్దరి ప్రవర్తనలో మార్పు కనిపించలేదు. ఫ్రెండ్ షిప్ హగ్ ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ పూర్తిగా నెగిటివిటీని సొంతం చేసుకున్నారు. షన్నూ కప్ పొందలేకపోవడానికి కారణం సిరితో స్నేహమేనంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేశారు. అరియానా చేసిన ఇంటర్వ్యూలోనూ షన్ను ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నాడు. షన్నూ.. బిగ్‏బాస్ ఇంట్లో ఉన్నప్పుడు తనపై వస్తున్న నెగిటివిటిని తగ్గించేందుకు అతని ప్రేయసి దీప్తి సునయన కూడా ప్రయత్నించింది. ఎపిసోడ్ చూసి క్యారెక్టర్ డిసైడ్ చేయకండి అంటూ పోస్ట్స్ చేసింది.

నీ మనస్సాక్షితోనైనా నిజాయితీగా ఉండు

కానీ.. తాజాగా దీప్తి సునయన చేసిన పోస్ట్స్ చూసిన నెటిజన్లు వాళ్లిద్దరూ విడిపోయే ప్రయత్నంలో ఉన్నారా ? అని కామెంట్స్ చేస్తున్నారు. దీప్తి తన ఇన్ స్టా స్టోరీలలో ఇలా రాసుకొచ్చింది. "కనీసం నీ మనస్సాక్షితోనైనా నిజాయితీగా ఉండు. నా చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా మారాయని తెలిసనప్పటికీ నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నా. ఈ సంవత్సరం నాకేమి బాగా అనిపించలేదు. కానీ చాలా నేర్చుకున్నాను." ఇలా వరుస పోస్ట్స్ చేసింది దీప్తి. దీంతో నెటిజన్లు దీప్తి.. షన్ను - సిరిల ఫ్రెండ్షిప్ విషయంలో హర్ట్ అయినట్లుంది. వీరిద్దరి మధ్య అంతా సవ్యంగానే ఉందా ? లేదా బ్రేకప్ చెప్పుకునేలా ఉన్నారా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ పై లవ్ బర్డ్స్ ఎలా రియాక్టవుతారో వేచి చూడాలి.


Tags:    

Similar News