విశాఖలో దట్టమైన పొగలు.. బెంబేలెత్తిన ప్రజలు

పారిశ్రామిక ప్రాంతంలో వెలువడిన దట్టమైన పొగలు విశాఖ వాసులను మరోసారి భయభ్రాంతులకు గురిచేశాయి. మల్కాపురంలోని హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ గొట్టాల నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో స్థానికులు భయాందోళనలకు [more]

;

Update: 2020-05-21 12:48 GMT

పారిశ్రామిక ప్రాంతంలో వెలువడిన దట్టమైన పొగలు విశాఖ వాసులను మరోసారి భయభ్రాంతులకు గురిచేశాయి. మల్కాపురంలోని హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ గొట్టాల నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. విశాఖ మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో ఎన్‌హెచ్‌యూను తెరిచేందుకు సంస్థ సన్నాహాలు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో భారీ ఎత్తున తెల్లని పొగ అలుముకోవడంతో ఎన్‌ఏడీ, మర్రిపాలెం, కంచరపాలెం వాసులు భయాందోళనకు గురై ఇళ్ల నంచి ఒక్కసారిగా బయటకు వచ్చారు. విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన మరవక ముందే అలాంటి ఘటన మరొక్కటి చోటుచేసుకోవడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే నిమిషాల వ్యవధిలోనే పొగ తీవ్రత తగ్గిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనపై హెచ్‌పీసీఎల్‌ యాజమాన్యం స్పందిస్తూ.. ‘‘ రిఫైనరీలో ఎన్‌హెచ్‌యూను తెరిచే క్రమంలో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు గుర్తించాం. దీంతో వెంటనే పరిస్థితిని చక్కదిద్దాం. ఇప్పుడు ఎలాంటి పొగ రావట్లేదు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది’’ అని హెచ్‌పీసీఎల్‌ ప్రతినిధి వివరించారు.

Tags:    

Similar News