కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలివే!

తాజాగా ఏపీ కొత్త మంత్రివర్గానికి శాఖలు ఖరారయ్యాయి. కొత్త మంత్రివర్గంలో ఉన్న పాత మంత్రుల శాఖలు మారాయి. అలాగే ఐదుగురు..

Update: 2022-04-11 11:01 GMT

అమరావతి : ఏపీ కొత్తమంత్రివర్గం నేటి నుంచి కొలువుదీరింది. ఉదయం 25 మంది మంత్రులచే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారాలు చేయించారు. అనంతరం ఒక్కొక్క మంత్రి తమకు మంత్రి పదవి ఇచ్చిన సీఎం జగన్ కాళ్లు మొక్కారు. తాజాగా ఏపీ కొత్త మంత్రివర్గానికి శాఖలు ఖరారయ్యాయి. కొత్త మంత్రివర్గంలో ఉన్న పాత మంత్రుల శాఖలు మారాయి. అలాగే ఐదుగురు మంత్రులకు ఉప ముఖ్యమంత్రుల బాధ్యతలు అప్పగించారు. రాజన్న దొర, ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణ, కె. నారాయణస్వామి, అంజాద్ భాషా లను ఉప ముఖ్యమంత్రులుగా ప్రకటించారు. విద్యాశాఖను బొత్స కు బదిలీ చేసి.. పురపాలక శాఖను ఆదిమూలపు సురేష్ కు కేటాయించారు.

కొత్త మంత్రులు - శాఖలు
1. ధర్మాన ప్రసాద రావు - రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు
2. సీదిరి అప్పల రాజు - మత్స్య, పశుసంవరధక శాఖ
3. బొత్స సత్యనారాయణ - విద్యా శాఖ
4.పీడిక రాజన్న దొర - గిరిజన సంక్షేమ శాఖ.
5. గుడివాడ అమర్నాధ్, పారిశ్రామిక - వాణిజ్య పన్నులు
6. బూడి ముత్యాల నాయుడు - పంచాయతీ రాజ్ శాఖ
7.దాడి శెట్టి రాజా - రోడ్లు, భవనాలు
8.పినెపె విశ్వరూప్‌ - రవాణా శాఖ
9. చెల్లుబోయిన వేణు - సమాచారం, సినిమాటోగ్రఫీ
10. తానేటి వనిత - హోం శాఖ , విపత్తుల నిర్వహణ
11. కారుమూరి నాగేశ్వర రావు - పౌర సరఫరాలు శాఖ
12.కొట్టు సత్యనారాయణ- దేవాదాయ శాఖ
13. జోగి రమేష్ - గృహ నిర్మాణ శాఖ
14. మేరుగ నాగార్జున - సాంఘాక సంక్షేమ శాఖ
15.విడదల రజినీ - వైద్య, ఆరోగ్య శాఖ
16.అంబటి రాంబాబు - జల వనరుల శాఖ
17. ఆదిమూలపు సురేష్ - పురపాలక శాఖ
18. కాకాణి గోవర్ధన్ రెడ్డి - వ్యవసాయం, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్
19. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - విద్యుత్, ఫారెస్ట్, ఎన్విరాన్‌మెంట్, సైన్స్‌ అండ్ టెక్నాలజీ
20. ఆర్కే రోజా - టూరిజం , సాంస్కృతిక, యువజన సర్వీసులు
21. కె.నారాయణ స్వామి - ఎక్సైజ్ శాఖ
22. అంజాద్ బాషా - మైనార్టీ శాఖ
23. బుగ్గన - ఆర్ధిక, స్కిల్ డెవలప్‌మెంట్
24.గుమ్మనూరు జయరామ్ - కార్మిక శాక
25. ఉష శ్రీ చరణ్ - స్త్రీ శిశు సంక్షేమ శాఖ


Tags:    

Similar News