ధైర్యంగా సాగు జగన్
గత ఎన్నికల్లో 151 మందిని ప్రజలు గెలిపిస్తే, వారు చేసిన చట్టాలను శాసనమండలి పేరుతో విపక్షం వ్యతిరేకిస్తుంని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. శాసనసభలో మండలిపై [more]
;
గత ఎన్నికల్లో 151 మందిని ప్రజలు గెలిపిస్తే, వారు చేసిన చట్టాలను శాసనమండలి పేరుతో విపక్షం వ్యతిరేకిస్తుంని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. శాసనసభలో మండలిపై [more]
గత ఎన్నికల్లో 151 మందిని ప్రజలు గెలిపిస్తే, వారు చేసిన చట్టాలను శాసనమండలి పేరుతో విపక్షం వ్యతిరేకిస్తుంని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. శాసనసభలో మండలిపై జరిగిన చర్చలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. ఓటమి చెందిన పార్టీ ఏ విధంగా గెలిచిన పార్టీ చేసిన చట్టాలను అడ్డుకోగలదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం అమలవుతున్న 160 దేశాల్లో 56 దేశాల్లో మాత్రమే ఎగువ సభలున్నాయన్నారు. ఎగువ సభలు లేని దేశాలు ఎంతో అభివృద్ధి చెందాయని తెలిపారు. మహాత్మాగాంధీ కూడా ఎగువ సభ విధానాన్ని వ్యతిరేకించిన విషయాన్ని ధర్మాన ప్రసాదరావు గుర్తు చేశారు. జవహర్ లాల్ నెహ్రూ సయితం పెద్దల సభపై పెదవి విరిచారన్నారు. ప్రజాబలంతో గెలవలేని నేతలు దొడ్డిదారిన వచ్చేందుకే శాసనమండలి ఉపయోగ పడుతుందని ధర్మాన ప్రసాదరావు తెలిపారు.
భయపడే చంద్రబాబు…..
భయపడే చంద్రబాబు సభకు రాలేదన్నారు. గతంలో ఎన్టీఆర్ రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేస్తామనే రాలేదని ధర్మాన అన్నారు. డొల్లతనం బయటపడుతుందనే చంద్రబాబు సభకు డుమ్మా కొట్టారన్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ అని గతంలో శాసనసభలో చంద్రబాబు తనంతట తానే తీర్మానం చేయించుకున్నారన్నారు. యాభై ఏళ్ల తర్వాత మహానేతగా మారాలని రికార్డుల్లో చేరడానికే చంద్రబాబు ఆ తీర్మానం చేయించుకున్నారని ధర్మాన చెప్పారు. సీఆర్డీఏ చట్టంపైన గతంలో శాసనమండలిలో చర్చించారా? అని ప్రశ్నించారు. ఒక్క రోజులోనే సీఆర్డీఏ చట్టం మండలి నుంచి వచ్చిందన్నారు ధర్మానప్రసాదరావు. కేవలం అభివృద్ధిని అడ్డుకోవడానికే, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వీటిని సెలెక్ట్ కమిటీకి పంపారని ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ఎగువ సభ అవసరం లేదన్నారు. తాను ఈ రద్దు తీర్మానాన్ని స్వాగతిస్తున్నాని, జగన్ ఇలాగే ధైర్యంగా ముందుకు సాగాలని ధర్మాన కోరారు.