రాజధాని ఎంపికలోనే తప్పు

ఏపీ రాజధాని అమరావతి పై అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ జరుగుతోంది. అయితే ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ అనుభవమున్న వాడని చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తే [more]

;

Update: 2019-12-17 11:19 GMT

ఏపీ రాజధాని అమరావతి పై అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ జరుగుతోంది. అయితే ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ అనుభవమున్న వాడని చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తే మోసం చేశారని దుయ్యబట్టారు. అసలు రాజధాని ఏర్పాటు లోనే అన్యాయం జరిగిందన్నారు. తన బంధువులు, సన్నిహితులు లబ్దిపొందేలా వ్యవహరించారన్నారు. కనీసం నైతికత లేకుండా చంద్రబాబు ప్రవర్తించారన్నారు. ప్రపంచంలో ఏ రాజధాని కూడా 600 చదరపు కిలోమీటర్ల కు మించకుండా ఉంటే, ఏపీలో రాజధాని ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల వ్యాసార్థంలో నిర్మించాలనుకోవడం పిచ్చి తనం కాదా? అని ప్రశ్నించారు.

అందరికీ అనుయాయులకే….

రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్లవుతున్నా ఇప్పటి వరకూ ఏపీకి రాజధాని లేకుండా పోయిందన్నారు. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులన అమలు చేయలేదన్నారు. శివరామకృష్ణ కమిటీ ఏమి చేయొద్దని చెప్పిందో అదే చేశారని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని ఉంటే దానిని ఎందుకు వదిలేసి వచ్చారన్నారు. సుప్రీంకోర్టు వద్దని వారించినా రాజధాని నిర్మాణం కోసం స్విస్ ఛాలెంజ్ పద్ధతిని ఎందుకు ఎంచుకున్నారని ధర్మాన ప్రసాదరావు నిలదీశారు. వేల ఎకరాల రైతుల నుంచి భూములను సేకరించి చంద్రబాబు తన అనుయాయుల లబ్ది పొందేలా వ్యవహరించారన్నారు.

Tags:    

Similar News