ఆ సభ అవసరమా?

డెబ్భయి ఏళ్లనాడే ఆచార్య ఎన్జీ రంగా పెద్దల సభ అవసరం లేదని చెప్పారని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న సభ ఆమోదించిన చట్టాలను [more]

;

Update: 2020-01-23 10:36 GMT

డెబ్భయి ఏళ్లనాడే ఆచార్య ఎన్జీ రంగా పెద్దల సభ అవసరం లేదని చెప్పారని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న సభ ఆమోదించిన చట్టాలను శాసనమండలి ఎలా అడ్డుకుంటుందని తెలిపారు. నాలుగు నెలల కాలం వరకూ ఏ బిల్లునైనా సెలెక్ట్ కమిటీకి పంపితే ఆపగలరన్నారు. అయితే ఇది మంచి పద్ధతి కాదన్నారు ధర్మాన ప్రసాదరావు. ఇలా చూసీ చూడనట్లు పోతుంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు మంచిచేయలేవన్నారు. ప్రభుత్వం పరుగులు తీయాలనుకుంటే పెద్దల సభ అడ్డుపడుతుందన్నారు. ప్రభుత్వాన్ని నడవనివ్వకుండా చేయడం కోసం ఇలాంటి దురుద్దేశాలకు ఎప్పుడూ ఒడిగడుతూనే ఉంటారన్నారు. మండలిని కొనసాగించాలా? వద్దా అన్న విషయంపై ఆలోచించాలని ధర్మాన ప్రసాదరావు ముఖ్యమంత్రి జగన్ ను కోరారు.

Tags:    

Similar News