రాజధాని ఉద్యమంపై ధర్మాన

రాజధాని అమరావతిలో జరుగుతున్న ఉద్యమంపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఫైరయ్యారు. రాజధాని అమరావతిలో ఉద్యమం చేస్తున్న అందరూ టీడీపీ నేతలేనని ఆయన అన్నారు. మూడు రాజధానులను [more]

;

Update: 2019-12-24 05:08 GMT

రాజధాని అమరావతిలో జరుగుతున్న ఉద్యమంపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఫైరయ్యారు. రాజధాని అమరావతిలో ఉద్యమం చేస్తున్న అందరూ టీడీపీ నేతలేనని ఆయన అన్నారు. మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటే ఎందుకు ఆందోళన ధర్మాన ప్రసాదరావు నిలదీశారు. 70 ఏళ్లుగా తమ ప్రాంతం అనుభవిస్తున్న బాధను ఎవరూ పట్టించుకోరా? అని ధర్మాన ప్రశ్నించారు. ఈ నెల 27వ తేదీన జరగబోయే మంత్రి వర్గ సమావేశంలో విశాఖను రాజధానిగా ప్రకటిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆందోళనలు మానుకుని అభివృద్ధికి సహకరించాలని ధర్మాన ప్రసాదరావు ఆందోళనకారులను కోరారు.

Tags:    

Similar News