నందికొట్కూరులో మళ్లీ మొదలయింది

నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్ధర్, పార్టీ ఇన్ ఛార్జి సిద్ధార్థ రెడ్డి మధ్య విభేదాలు ఇప్పట్లో ముగిసేలా లేవు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఎంపికలో రెండు [more]

Update: 2020-03-13 04:04 GMT

నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్ధర్, పార్టీ ఇన్ ఛార్జి సిద్ధార్థ రెడ్డి మధ్య విభేదాలు ఇప్పట్లో ముగిసేలా లేవు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఎంపికలో రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే ఇన్ ఛార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. చెరి మూడు మండలాలను అప్పగించారు. ఆ మండాలాల్లో అభ్యర్థులను వారే ఎంపిక చేసుకుంటారని చెప్పారు. అయితే సిద్ధార్ధరెడ్డి మాత్రం తనకు నాలుగు మండలాలు కావాలని పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్యే ఆర్థర్ వర్గం ఆందోళనకు దిగింది. నాలుగు మండలాలు సిద్ధార్ధ రెడ్డికి అప్పగిస్తే తమకు ఏం అవసరం లేదని తేల్చి చెప్పింది. దీంతో రెండు వర్గాల మధ్య మరోసారి పంపకాలు చేసేందుకు పార్టీ పెద్దలు నిర్ణయించారు.

Tags:    

Similar News