మాజీ మంత్రి సి.రామచంద్రయ్య ట్విస్ట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు నిరసనగా ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే, జనసేన పార్టీలో ఆయన చేరతారని ప్రచారం జరిగింది. కానీ, ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. 13వ తేదీన విజయనగరం జిల్లాలో పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.
జనసేనలో చేరతారనుకుంటే.....
నిజానికి రామచంద్రయ్య జనసేనలో చేరతారనుకున్నారు. చిరంజీవితో ఉన్న అనుబంధం, సామాజిక కారణాలతో ఆయన పవన్ వైపు మొగ్గు చూపుతారని అందరూ భావించారు. కానీ సీఆర్ మాత్రం జగన్ పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. సి.రామచంద్రయ్య రాకతో రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.