విశాఖకు మరిన్ని వరాలు
విశాఖకు రాజధానిని తరలించే యోచనలో ఉన్న జగన్ ప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశాఖలో ఆర్కే బీచ్ నుంచి బీమిలి [more]
;
విశాఖకు రాజధానిని తరలించే యోచనలో ఉన్న జగన్ ప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశాఖలో ఆర్కే బీచ్ నుంచి బీమిలి [more]
విశాఖకు రాజధానిని తరలించే యోచనలో ఉన్న జగన్ ప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశాఖలో ఆర్కే బీచ్ నుంచి బీమిలి వరకూ ట్రామ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ట్రామ్ నమూనాను కూడా ప్రభుత్వం పరిశీలించింది. చైనా ట్రామ్ ఏర్పాటుకు సంబంధించి కన్సల్టెంట్ లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయాన్ని విశాఖలో ఇప్పటికే ఉన్న మిలీనియం టవర్స్ లోనే ఏర్పాటు చేయనున్నారు. సెక్రటేరియట్, సీఎం ఆఫీస్ కు ఇప్పటికే విశాఖలో బిల్డింగ్ లు సిద్ధమయ్యాయి. సీఎం క్యాంప్ టవర్స్ ఇన్నోవేషన్ వ్యాలీలో ఏర్పాటు చేయనున్నారు.