బ్రేకింగ్ : సైకో కిల్లర్ కు ఉరిశిక్ష

హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్య చేసిన కేసుల్లో శ్రీనివాసరెడ్డికి పాక్సో కోర్టు [more]

;

Update: 2020-02-06 13:13 GMT

హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్య చేసిన కేసుల్లో శ్రీనివాసరెడ్డికి పాక్సో కోర్టు మరణ శిక్ష విధించింది. శ్రీనివాసరెడ్డిని దోషిగా కోర్టు నిర్ధారించింది. మూడు కేసుల్లోనూ ప్రాసిక్యూషన్ సాక్ష్యాలను నిరూపిాంచిందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజిపూర్ గ్రామానికి చెందిన సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డి.. లిఫ్ట్ పేరుతో ముగ్గురు మైనర్ బాలికలను బైక్‌పై ఎక్కించుకొని తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేసి బావిలో పూడ్చిపెట్టాడు. అలా ఇప్పటివరకు శ్రావణి, మనీషా, కల్పన లను చంపి నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈకేసుల్లో శ్రీనివాసరెడ్డికి న్యాయమూర్తి ఉరిశిక్ష విధించారు. శ్రీనివాసరెడ్డికి మరణశిక్ష విధించడంతో బాధిత కుటుంబాలతో పాటు హాజీపూర్ గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News