శంషాబాద్ ఎయిర్ పోర్టులో విదేశీ కరెన్సీని?

శంషాబాద్ విమానాశ్రయంలో సినీఫక్కీలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడటం కలకలం సృష్టించింది. హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్తున్న ఇద్దరు ప్రయాణికుల నుండి 54 లక్షల విదేశీ కరెన్సీని [more]

;

Update: 2021-02-02 09:04 GMT

శంషాబాద్ విమానాశ్రయంలో సినీఫక్కీలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడటం కలకలం సృష్టించింది. హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్తున్న ఇద్దరు ప్రయాణికుల నుండి 54 లక్షల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్తున్న ఇద్దరు ప్రయాణికులు ఎవరికీ ఏమాత్రం అనుమానం రాని రీతిలో కారా బూందీ ప్యాకెట్లలో విదేశీ కరెన్సీ కట్టలు పెట్టుకుని దర్జాగా ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. అయితే లగేజీ బ్యాగులను స్క్రీనింగ్ చేసిన సీఐఎస్ఎఫ్ అధికారులు అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఇంకేముంది కారా బూందీ ప్యాకెట్లను ఓపెన్ చేయడంతో కరెన్సీ నోట్ల కట్టలు బయట పడ్డాయి. ఈ మేరకు కారా బూందీ ప్యాకెట్ల లో నుండి 54 లక్షల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News