ఈ 11 రోజులు అందరికీ పండుగే
తెలంగాణలో గణేష్ పండగ అంటే అందరికీ పండుగే….. నవరాత్రులు ప్రారంభమయ్యే రెండు నెలల ముందు నుంచీ వివిధ వృత్తుల వారికి పని దొరుకుతుంది. వినాయకుల తయారీ ఒక్క [more]
;
తెలంగాణలో గణేష్ పండగ అంటే అందరికీ పండుగే….. నవరాత్రులు ప్రారంభమయ్యే రెండు నెలల ముందు నుంచీ వివిధ వృత్తుల వారికి పని దొరుకుతుంది. వినాయకుల తయారీ ఒక్క [more]
తెలంగాణలో గణేష్ పండగ అంటే అందరికీ పండుగే….. నవరాత్రులు ప్రారంభమయ్యే రెండు నెలల ముందు నుంచీ వివిధ వృత్తుల వారికి పని దొరుకుతుంది. వినాయకుల తయారీ ఒక్క ఎత్తైతే…. నిర్వాహాకులు మండపాలను అలంకరణ చేయడం మరో ఎత్తు.
ప్రతి నిత్యం పూజలు…
మండపాలను శోభాయమానంగా నిర్వాహాకులు అలంకరిస్తారు. వారం రోజుల ముందు నుంచి మండపాలు వేసే మేదరులకు పనిలభిస్తుంది. వీధులు, కాలనీల్లో వినాయక మండపాలు వెలుస్తుంటాయి. ఏటా ఈ సంఖ్య పెరుగుతూ హిందూ ధర్మాన్ని, కాలనీల్లో ఉన్న వాసులను ఈ ఉత్సవాలు ఏకం చేస్తున్నాయి. వినాయక చవితి మొదటి రోజు నుంచి 11 రోజుల పాటు ఉదయం, రాత్రి గణనాధునికి భక్తితో పూజలు చేస్తారు. దంపతులు మండపాలలో కూర్చొని వారికి నచ్చిన నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ పూజలకు అర్చకున్ని పెట్టుకుంటారు.
పాటల హోరు….
ఇక మండపం వెలిసిన వెంటనే అన్నిమండపాల్లోనూ సౌండ్ బాక్సులు మోగుతుంటాయి. భక్తిరసమైన పాటలతో స్థానికులను అలరిస్తుంటారు. రాత్రి సమయాల్లో కొందరు యువకులు, యువతులు దాండియా వంటి పాటలతో నృత్యాలు చేస్తారు. హైదరాబాద్ లో ఈసారి లక్ష గణేష్ విగ్రహాలు ఏర్పాటయ్యాయి.
నిమజ్జనంపైనే దృష్టి……
మండపాల్లో గణనాధుడు కొలువుదీరగానే ఇక నిర్వాహాకుల దృష్టంతా నిమజ్జనంపైనే ఉంటుంది. చివరి రోజు నిమజ్జనం చేస్తే ఆ ఖర్చు భారీగా ఉంటుంది. దీంతో కొందరు 5 రోజులకు, 7 రోజులకు, 9 రోజులకు నిమజ్జనం చేస్తుంటారు. మిగితా వారు అనంత చతుర్థశిరోజు నిమజ్జనం చేస్తారు.
ఖర్చు బారెడు….
నిమజ్జనం ఖర్చు అంతా … ఇంతా కాదు. యువత డబ్బు వాయిద్యాలు, బాజా బజంత్రీలతో ఆడుతూ… పాడుతూ శోభాయాత్ర కొనసాగాలంటే ఖర్చుతో కూడుకున్నదే. బ్యాండు, లారీ, సౌండ్ బాక్సులు, టపాసులు, ఆర్కెస్ట్రా, నృత్యాలు చేసేవారు పాటలు పాడే వారు….ఇలా వీరి ఖర్చంతా నిర్వాహాకులు భరించాల్సిందే. ఈ వేడుకల సమయంలో వీరికి బాగా డిమాండ్ ఉంటుంది. ఒక్క గంట షేర్ బ్యాండ్ మోగాలంటే 10వేల రూపాయలు చెల్లించాల్సిందే.
పిల్లల కేరింతలు……
నిమజ్జన శోభాయాత్రలో చిన్నారుల సందడి అంతా… ఇంతా కాదు… ఈ నవరాత్రులు చిన్నారులు పుస్తకాలు కాస్త పక్కకు పెట్టి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటారు. ఇక చివరి రోజు వీరిదే అట్రాక్షన్. ప్రత్యేక మైన దుస్తులు వేసుకుని అందరూ కలిసి లయబద్దంగా ఆడుతూ పాడుతూ శోభాయాత్రలో ఆకట్టుకుంటారు. ఈ వేడుకలో చిన్నా…. పెద్దా, ఆడ, మగా అనే తేడా లేకుండా అందరూ చిందులువేస్తారు…. అందరికీ హుషారు తెప్పిస్తారు.
ఇతర జిల్లా కళాకారులు…
ఈ వేడుకల్లో వివిధ జిల్లాల నుంచి కళాకారులను నిర్వాహాకులు రప్పిస్తారు. డప్పు కళాకారులు, నృత్యాలు చేసేవారు, పాటలు పాడేవారు ఇలా వివిధ రకాల కళాకారులువచ్చి వేడుకల్లో పాల్గొని వారు కొంత డబ్బు సంపాదిస్తారు.
ganesh festival in telangana is a festival for everyone.