లడ్డూలకు రక్షణ కరవు!
వినాయకుడి కోసం భారీ ఎత్తున లడ్డూలను తయారు చేయడం, వాటని వేలం పాటలో విక్రయించడం... ఇవన్నీ గత కొంతకాలంగా సాగుతున్న ప్రక్రియ. బాలానగర్ గణేష్ లడ్డూల విక్రయం ప్రతీ ఏడాది ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది. వేలం పాట కోసం ప్రదర్శిస్తున్న లడ్డూలు దొంగతనానికి గురవడం ఈ ఏడాది ట్రెండ్‌గా మారింది.
వినాయకుడి కోసం భారీ ఎత్తున లడ్డూలను తయారు చేయడం, వాటని వేలం పాటలో విక్రయించడం... ఇవన్నీ గత కొంతకాలంగా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నాయి. బాలానగర్ గణేష్ లడ్డూల విక్రయం ప్రతీ ఏడాది ఓ ట్రెండ్ సెట్టర్‌గా మారుతోంది. వేలం పాట కోసం ప్రదర్శిస్తున్న లడ్డూలు దొంగతనానికి గురవడం ఈ ఏడాది ట్రెండ్‌గా మారింది.
శనివారం చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘాన్సీ బజార్‌లో ఉన్న గణేష్ మండపం నుంచి ఓ లడ్డూని దొంగలించారు. గ్రూపుగా వచ్చిన విద్యార్థులు ఈ దొంగతనానికి పాల్పడటం గమనార్హం. వినాయకుడి ముందున్న 21 కిలోల లడ్డూ మాయమైన విషయాన్ని ఆదివారం గమనించిన నిర్వాహకులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు.
కొంతమంది విద్యార్థులు లడ్డూను దొంగిలించిన విషయం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. తన స్నేహితులతో వచ్చిన విద్యార్థుల్లో ఒకరు లడ్డూను తన స్కూలు బ్యాగులో వేసుకుని తీసుకుని వెళ్లిపోయాడు. ఈ విషయమై నిర్వాహకులు చార్యినార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు.
కొన్ని రోజుల కిందట కొంతమంది ఆగంతకులు మియాపూర్‌లోని ఓ గణేష్ మండపంలో పెట్టిన 11 కిలోల లడ్డూని కూడా దొంగతనం చేయడం గమనార్హం. దీంతో వినాయకుడి లడ్డూ రక్షణ కోసం మంటప నిర్వాహకులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.