శుభకార్యం, పండుగ ఇలా అకేషన్ ఏదైనా సరే.. మహిళలు ముఖ్యంగా షాపింగ్ చేసేది బంగారం కోసమే. ఇక పెళ్లిళ్ల సీజన్ లో బంగారానికి ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీజన్ మొదలు నుంచి బంగారం రేట్లు క్రమంగా పెరుగుతున్నా.. కొనుగోళ్లు మాత్రం తగ్గవు. అలాంటి బంగారం ప్రియులకు ఒక గుడ్ న్యూస్. కొద్దిరోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధర నేడు కాస్త తగ్గింది. వెండి మాత్రం పైపైకి పోతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, దేశంలోని ముఖ్యనగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
Also Read : రోజా డిసైడ్ అయ్యారట.. జగన్ తో మీటింగ్ తర్వాత?
హైదరాబాద్ లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర ఆదివారం రూ.50,190గా ఉండగా.. సోమవారానికి రూ.10 తగ్గింది. సోమవారం ఉదయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,180గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,990గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ నగరాల్లో ఇవే రేట్లు ఉన్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,990గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,180గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,990గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,180గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికొస్తే.. సోమవారం కిలో వెండి ధర రూ.700 మేర పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.70,000కు చేరింది. హైదరాబాద్ సహా పలు ప్రధాన నగరాల్లో ఇదే ధర ఉంది. ఆర్ధిక రాజధాని ముంబై, దేశరాజధాని ఢిల్లీలో రూ. కిలో వెండి ధర రూ. 64,000 గా ఉంది.